LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్
‘జీవన్ ఉత్సవ్’ పాలసీ గురించి తెలుసుకోండి..
LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో సరి కొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ ఇది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్
ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్.. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లో కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.ఒకవేళ మరణిస్తే..
ఈ ప్లాన్ తీసుకుంటే.. పాలసీదారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో బీమా చేసిన మొత్తాన్ని, గ్యారెంటీ అడిషన్స్ ...