సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy).. మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. 1.58 లక్షల ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది.
జూన్ 6 నుంచి డెలివరీలు
2021, ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో కంపెనీ ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ధరను అమాంతం పెంచేసింది. అయితే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు జూన్ 6 నుంచి బెంగళూరు కేంద్రంగా దశలవారీగా ప్రారంభమవుత...