SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?
Bengaluru | రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో విశేష సేవలందించిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (SM Krishna) ఈరోజు ఉదయం సదాశివనగర్ నివాసంలో కన్నుమూశారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణ.. ఆధునిక బెంగళూరును ప్రపంచ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.తన పదవీకాలంలో, SM కృష్ణ బెంగళూరు అభివృద్ధికి ఎక్కవగా ప్రాధాన్యతనిచ్చారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అతని ప్రయత్నాల వల్లే బెంగళూరు "సిలికాన్ సిటీ(Silicon City)గా అవతరించింది అలాగే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ(Silicon valley)కి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది, IT రంగంలో యువ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించింది.టాస్క్ ఫోర్స్ (BATF)బెంగళూరు నగరం గ్లోబల్ సిటీగా పెంపొందించడానికి ఎస్ఎం కృష్ణ అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. 1999లో, ఆ...