వ్యక్తిపై మూత్రం పోసిన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య
మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలపై మంగళవారం అర్ధరాత్రి అరెస్టు అయిన ప్రవేశ్ శుక్లా(30) నివాసంలో కొంత భాగాన్ని అధికారులు బుధవారం బుడ్డోజర్లతో కూల్చివేశారు. సిద్ధి జిల్లాలో పోలీసు బృందాలు తనిఖీలు చేసి శుక్లాను అరెస్టు చేశాయి. అతని అరెస్టు తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ సాకేత్ మాల్వియా.. శుక్లాపై జాతీయ భద్రతా చట్టం(NSA) కింద కేసు నమోదు చేశారు.NSAని అనుసరించి, బుధవారం బుల్డోజర్లు శుక్లా ఇంటికి చేరుకున్నాయి. ఇల్లు కూల్చివేయొద్దని శుక్లా తండ్రి, ఇతర కుటుంబ సభ్యులకు విన్నవించినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, అతని కుటుంబాన్ని, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకోవద్దని కుటుంబ సభ్యులు కోరారు. ఆ వీడియో నకిలీదని, "మమ్మల్ని ట్రాప్ చేయడానికి కుట్ర" జరిగిందని అతని తండ్రి పేర్కొన్నారు. "మా అబ్బాయి అలా చేయలేడు," అని అతను అధికారులకు మొరపెట్టుకున్నాడు. క...