
komuravelli : చురుగ్గా సాగుతున్న కొమురవెల్లి కొత్త రైల్వే స్టేషన్ పనులు
komuravelli : తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయం (komuravelli Mallanna Temple ) ఒకటి. సిద్ధిపేట జిల్లా (Siddipet District) చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ని ఒక కొండపై వెలిసిన మల్లిఖార్జున స్వామి ఆలయ క్షేత్రం సిద్ధిపేట నుంచి సుమారు 24 కి.మీ. హైదరాబాద్ నుంచి సుమారు 90 కి.మీ. వరంగల్ నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతీ సంవత్సరం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు 25 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. ఇక సాధారణ రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.ప్రస్తుతం ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కొమురవెల్లికి సుమారు 45 కి.మీ. దూరంలో జనగామ రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ నుంచి ...