Watch: ఈ భయంకరమైన పాము టాలెంట్ అదుర్స్.. మెరుపు వేగంతో పాము ఎరను ఎలా పట్టేసిందో చూడండి..
Snake viral video : ఈ ప్రకృతిలో శక్తితోపాటు యుక్తిని కలిగి ఉన్న జంతువులే మనుగడ సాగిస్తాయి. తక్కినవి ఆహారమవుతాయి. సరీసృపాల ప్రపంచంలో పాములు విలక్షణమైనవి. వీటిలోని వైవిధ్యమైన జాతులకు చెందిన సర్పాలు వాటి పరిసరాలలో కలిసిపోయి తమ ఎరల కన్నుగప్పి ఆహారాన్ని చేజిక్కించుంటాయి. సర్పాలకు సంబంధించి అద్భుతమైన తెలివిని చూపించే ఇటీవలి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది.వైరల్ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో ఓ పాము అత్యంత చాకచక్యంగా మెరుపు వేగంతో ఓ పక్షని వేటాడే దృశ్యాన్ని చూపుతుంది. ఇక్కడ ఒక పాము రాళ్ళు, ఆకుల మధ్య దాక్కొని ఓపికగా తన ఆహారం కోసం వేచి ఉంది. పక్షులను ఆకర్షించడానికి దాని పామును తన తోకను ఒక కీటకంలా ఊపింది.. అదే సమయంలో అక్కడికి వచ్చిన పక్షిని అకస్మాత్తుగా, మెరుపు వేగంతో.. ఖచ్చితత్వంతో, పాము పక్షిపైకి దూసుకుపోతుంది. దానిని విజయవంతంగా దాని కోరలతో బంధిస్తుంది. ప్రకృతి శక్తి, పాము అసాధార...