Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గడువు
Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మసీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించడలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
హిందూ సంస్థల నిరసనలు
మరోవైపు హ...