Delhi Pollution | ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలు బంద్.. పూర్తిగా ఆన్‌లైన్ లోనే తరగతులు
Delhi Pollution | ఢిల్లీలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సీజన్‌లో అత్యధికంగా 494కి ఎగబాకింది. పాఠశాలలు. ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులను పూర్తిగా నిలిపివేసి ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జాతీయ రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలా ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్‌లు 500 మార్కు దాటి "ఆందోళనకరంగా" స్థాయికి చేరుకోవడంతో మొత్తం AQI 'సివియర్ ప్లస్' కేటగిరీలో కొనసాగింది.ఢిల్లీలోని ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, జహంగీర్‌పురి, మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంతో పాటు పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) మంగళవారం ఉదయం 5 గంటలకు 500 గంటలకు నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపింది.
GRAP-IV ఆంక్షలు
దేశ రాజధానిలో ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)...