Rahul Gandhi | వీసీల నియామకాలపై రాహుల్ గాంధీ ‘తప్పుడు ప్రచారం’.. చర్యలు తీసుకోవాలని 181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ
Rahul Gandhi | న్యూఢిల్లీ: యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అసత్య ప్రచారం చేశారని, వైస్ ఛాన్సలర్ల పరువు తీశారని ఆరోపిస్తూ మాజీ, ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌లతో సహా కనీసం 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖపై సంతకం చేశారు. రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు.యూనివర్శిటీ హెడ్‌ల నియామక ప్రక్రియకు సంబంధించి వైస్ ఛాన్సలర్‌లను కేవలం మెరిట్‌తో కాకుండా ఏదో ఒక సంస్థతో అనుబంధం ఆధారంగా నియమించారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపించారని వీసీలు, విద్యావేత్తలు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.విద్యావేత్తలు చెబుతున్నదాని ప్రకారం, వైస్-ఛాన్సలర్‌లను విద్యార్హతల కంటే కనెక్షన్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ వాదనలను సంతకం చేసినవారు తీవ్రంగా ఖండించా...