Mahakumbh 2025 | మహాకుంభమేళాకు 37 వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత
లక్నో: మహా కుంభమేళా 2025 (Mahakumbh 2025) కు యూపీ సర్కారు సన్నద్ధమవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు పటిష్ట భద్రత కల్పించేందుకు యోగి ప్రభుత్వం పట్టిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది. భద్రత పర్యవేక్షణలో స్నిపర్‌లు, NSG కమాండోలు, కమాండో స్క్వాడ్‌లు, ATS, STF, BDDS బృందాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను మోహరించాలని భావిస్తోంది యూపీ ప్రభుత్వం.నివేదికల ప్రకారం.. మహాకుంభ మేళాలో 7 అంచెల భద్రత ఉంటుంది. ఇది కాకుండా, మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని 10 జోన్లు, 25 సెక్టార్లు, 56 పోలీస్ స్టేషన్లు, 155 అవుట్‌పోస్టులుగా విభజించారు. ప్రతి స్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ ఉండేలా భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. ఎలాంటి అసౌకర్యం, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ప్రయాగ్ రాజ్ నగరంలో రెండు NSG కమాండో కంటెంజెంట్లు, 26 యాంటీ-సబోటేజ్ (AS) తనిఖీ బృందాలు మోహరించనున్నామ...