
Bhojshala Dispute : వసంత పంచమి నాడు హిందువులు, ముస్లింలకు ప్రార్థనా సమయాలు ఖరారు!
Bhojshala | మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దం నాటి భోజ్‌శాల కట్టడం వద్ద రేపు (జనవరి 23) వసంత పంచమి వేడుకల నిర్వహణపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఈసారి వసంత పంచమి శుక్రవారం కలిసి రావడంతో నెలకొన్న ఉత్కంఠకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది.సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు వసంత పంచమి పూజలు, హవనాలు నిర్వహించుకోవచ్చు. ఇక ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.నమాజ్ సమయం (1 PM - 3 PM) లో ముస్లింల కోసం కాంప్లెక్స్ లోపల ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలని, వారికి వేర్వేరుగా వచ్చే (Entry), వెళ్లే (Exit) మార్గాలను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ప్రార్థనలకు వచ్చే వారి జాబితాను ముందే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ముస్లిం కమిటీని కోర్టు ఆదేశించింది.హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేక...
