Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ.. కారణం ఎందుకో తెలుసా..
ధన్ బాద్: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు.
ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ పై రాసి రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతీ రోజు కేవలం గంట ...