Manu Bhaker | చరిత్ర సృష్టించిన మను భాకర్.. సింగిల్ ఒలింపిక్స్‌లో 2 పతకాలు
Manu Bhaker | 2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో మను భాకర్ చారిత్రకమైన రికార్డును నెలకొల్పింది. స్వాతంత్య్రానంతరం ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ (Manu Bhaker ) భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును సుస్థిరం చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భాకర్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.వీరిద్దరూ కాంస్య పతకం కోసం జరిగిన పోరులో దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్, లీ వోన్హోను ఓడించారు, దీంతో భారత్ కు రెండవ విజయం వరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనుకి ఇది రెండో పతకం, స్వాతంత్ర్యం తర్వాత ఒకే సీజన్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలు.మను భాకర్-సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) ద్వయం అద్భుత ప్రదర్శనను కనబరిచింది. దక్షిణ కొరియా ద్వయం ఓహ్ యే జిన్, లీ వోన్‌హోవిత్‌లను 16-10 స్...