RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..
సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు..
RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా? అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ...