Sambhal News | 1978 తర్వాత యూపీలో రాధాకృష్ణ దేవాలయాన్ని కనుగొన్న పోలీసులు
sambhal uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని గుర్తించిన తర్వాత హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంభాల్‌లోని ముస్లిం మెజారిటీ సరాయ్ తరిన్ ప్రాంతంలో మరొక పాడుబడిన రాధా-కృష్ణ దేవాలయాన్ని కనుగొన్నారు. డిసెంబర్ 17న మంగళవారం పోలీసులు ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఆలయంలో ఆంజనేయస్వామితోపాటు శ్రీకృష్ణుడు, రాధ దేవత విగ్రహాలను గుర్తించారు. దీంతో వెంటనే ఆలయ ప్రాంగణంలో అధికారులు పరిశుభ్రత, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఈ పురాతన రాధా-కృష్ణ దేవాలయం చుట్టూ హిందూ కుటుంబాలు వలస పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాడుబడిన ఆలయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తిరిగి తెరిచారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ ఆలయాన్ని పునఃప్రారంభించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇక్కడ ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత ...