AR Rahman | ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోవడానికి కారణం ఇదే..!
AR Rahman Divorce | ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను తమ 29 ఏళ్ల వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మంగళవారం రాత్రి సైరా బాను లాయర్ వందనా షా కీలక ప్రకటన విడుదల చేశారు. ‘భావోద్వేగపూరితమైన గాయం’ కారణంగా విడిపోతున్నారని ప్రకటించారు. చాలా కాలంగా భావోద్వేగ సవాళ్లను ఎదుర్కొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట 1995లో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.వీరి విడాకుల వార్తలు వ్యాపించడంతో, AR రెహమాన్ పాత ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇంటర్వ్యూలో, అతను సైరాను మొదటిసారి కలిసిన గురించి, వారి సంబంధం ప్రారంభ రోజుల గురించి మాట్లాడాడు. తన వివాహంలో తన కుటుంబం ఎలా కీలక పాత్ర పోషించిందో కూడా పంచుకున్నాడు.ది స్పిరిట్ ఆఫ్ మ్యూజిక్ పుస్తకంలో భాగంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో రెహమాన్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను చిన్నతనంలో సంబంధాల గురించి,...