sahityam
నన్ను క్షమించండి…
*నన్ను క్షమించండి* ======🎊======= నన్ను క్షమించండి… తేనెపూతల మాటలతో మెప్పించలేక పోయినందుకు.. నన్ను క్షమించండి.. పూటకో మాటలా నైజాన్ని మార్చుకోనందుకు కటువు మాటతీరుతోనైనా బ్రతుకు గమనం బోధించాలనుకున్నా.. కష్టాలెన్నో చూసిన అనుభవంతో పదేపదే జాగ్రత్తలు వల్లెవేశా. వెలివేత బహుమతి అందుతుందనుకోలేదు. బంధాలమధ్య బీటలు చేరుతాయనుకోలేదు.. నన్ను నన్నుగా ఒప్పుకోలేని బంధంలో నిజమైన ప్రేమ.. ఆప్యాయత నాకు లభిస్తాయని నేనెప్పుడూ అనుకొను.. అందుకే దూరమైనా నేరమేమీ కాదు.. అయినా మనసులో ఒక్క ఆశయితే ఉంది కాలమే గురువుగా మారుతుందని.. […]
సాహిత్యం : నిన్న.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు..
Literature article *నిన్న* కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు ఇప్పుడు నీతో ఉన్నా నీవు గుర్తించనిది తరువాత జ్ఞాపకమై వేదిస్తుందేమో..!! పరిమితి మరిచిన వ్యాపకాల మాయ మనిషిలోని మనసును మాయం చేసి మమతకు దూరంగా తీసుకెళ్తోంది.. కన్నీళ్లను కూడా పట్టించుకోని అతని నైజం ఆమె దుఃఖన్ని తలగడలో దాచుకోమంటే మౌనంగా రోధించిన సహనం జీవితాన్ని సైతం వెలివేసుకుని వెళ్ళాక ఒంటరితనంలో వెలితి అర్ధమౌతున్నా ఏం లాభం ఆ ఆవేదన వెనుక ఉన్న నిరాశ… వెలివేతలో ఉన్న ఎదకోత.. […]
