Wednesday, February 18"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: SAFF Championship 2023

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

‘మా తుఝే సలాం’.. ‘వందేమాతరం’..

Entertainment, Trending News
‘వందేమాతరం’.. పాటతో మార్మోగిన స్టేడియం.. శాఫ్ చాంపియన్‍షిప్ ఫైనల్‍లో భారత్ గెలిచిన తర్వాత స్టేడియంలోని వేలాది మంది మా తుఝే సలాం పాట పాడారు. ఈ వీడియోలు వైరల్‍గా మారాయి. సౌత్ ఏషియన్ ఫుల్‍బాల్ ఫెడరేషన్ (SAFF- శాఫ్) చాంపియన్‍షిప్ టోర్నమెంట్ టైటిల్‍ను ఇండియా ఫుల్‍బాల్ జట్టు 9వ సారి గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ ఫైనల్‍లో కువైట్‍పై పెనాల్టీ షూటౌట్ లో గెలిచి మరోసారి శాఫ్ విజేతగా అవతరించింది టీమిండియా . మ్యాచ్ సమయంలో 1-1తో రెండు జట్లు సమానంగా నిలవగా... తర్వాత పెనాల్టీ షూ టౌట్ జరిగింది. ఇందులో 5-4తో భారత జట్టు ఘన విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగిం ది. టీమిండియా గెలుపొందగానే స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ‘‘మా తుఝే సలాం’’ అనే పాటను ముక్తకంఠంతో పాడారు. వందేమాతరం అంటూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్...