Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల పుణ్యక్షేత్రానికి (Sabarimala) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్ -కొట్టాయం, నర్సాపుర్-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
Sabarimala ప్రత్యేక రైళ్ల వివరాలు
సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ (07129,07130) ప్రత్యేక రైళ్లు - నవంబరు 26, డిసెంబరు 3న, తిరుగుప్రయాణం - నవంబరు 28, డిసెంబర్ 5న ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గు...