భారత్‌కు రష్యా చమురు సరఫరాపై పుతిన్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) తన రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా, భారతదేశానికి ఇంధన సరఫరాపై కీలక ప్రకటన చేశారు. భారత్‌కు నిరంతరాయ రవాణా"ను కొనసాగించడానికి మాస్కో కట్టుబడి ఉందని శుక్రవారం పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన 23వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.భారతదేశంపై అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇంధన సరఫరా విషయంలో రష్యా స్థిరంగా నిలబడుతోంది. భారతదేశ ఇంధన అభివృద్ధికి అవసరమైన ప్రతిదానికీ నమ్మకమైన సరఫరాదారు," అని పుతిన్ స్పష్టం చేశారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక ఇంధన అవసరాలకు అంతరాయం లేకుండా మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. "వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కోసం నిరంతరాయంగా ఇంధన రవాణాను కొనసాగించడానికి మేమ...


