New license rules | డ్రైవింగ్ లైసెన్స్ జారీలో విప్లవాత్మక మార్పులు.. జరిమానాలు, చార్జీలు ఇవీ..
New license rules | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేసే ప్రక్రియలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇది జూన్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్సింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, కాలుష్యాన్ని నివారించడం, రహదారి భద్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతోనే ఈ కొత్త నిబంధనలను కేంద్రం తీసుకువస్తోంది.జూన్ 1 నుండి వాహనదారులు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTO లకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల నుంచి తీసుకోవచ్చు. ఈ ప్రైవేట్ సంస్థలు లైసెన్స్ అర్హత కోసం పరీక్షలు నిర్వహించడానికి, సర్టిఫికెట్‌లను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. దీని వల్ల లైసెన్సుల ప్రక్రియ సులభంగా. వేగవంతంగా జరుగుతుంది. ప్రభుత్వ RTOల వద్ద గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులను కూడా తప్పుతాయి.
భారీగా జరిమానాలు..!
జరిమానాలు రూ. 1000 రూ. 2000 మ...