Sadanandan Master | దుండగుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..
సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) ..కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) . ఆయన జీవిత యాత్ర ఇప్పుడు మరో మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయనను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత గౌరవం కాదు… దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల హింసకు బలి అయిన లక్షలాది దేశభక్తుల త్యాగాలకు గుర్తింపు కల్పించే ఘట్టమని చెప్పవచ్చు. . . రాజ్యసభకు సి సదానందన్ మాస్టర్ నామిన...