
Namo Bharat : నమో భారత్ భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు.. వీటి వేగం, మార్గాలు పూర్తి వివరాలు ఇవే..
భారత్‌లో హైస్పీడ్ రైళ్ల విషయానికొస్తే రాజధాని, శతాబ్ది పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి. కానీ భారతీయ రైల్వేలలో ఇపుపుడు పూర్తిగా మారిపోయింది. నేడు దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్‌ప్రెస్ కాదు, ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లో నడుస్తున్న ఆధునిక "నమో భారత్" (Namo Bharat ). ఇది 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది.దీనికి ముందు, 2016లో ప్రారంభమైన గతిమాన్ ఎక్స్‌ప్రెస్ వేగవంతమైన రైలుగా గుర్తంపు పొందింది. ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.. హజ్రత్ నిజాముద్దీన్ - ఆగ్రా మధ్య 160 కి.మీ. వేగంతో నడుస్తోంది. తరువాత, వందే భారత్ రైళ్లు కూడా ఈ గరిష్ట వేగానికి సరిపోయాయి. అయితే, జూన్ 24, 2024న, రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని పేర్కొనకుండా దాని గరిష్ట వేగాన్ని 160 కి.మీ....