
RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..
Railway Jobs - RRB Group D 2025 : యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి ఏకంగా 32000 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం లెవల్-1 గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 ను అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in లేదా www.rrbapply.gov.inలో జనవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. ఈనోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..భారతీయ రైల్వే ఈ ఏడాది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. జైపూర్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోరఖ్‌పూర్, ముంబైతో సహా వివిధ జోన్‌లకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చింది. లెవెల్-1 గ్రూప్ డి 32438 పోస్టుల విషయానికొస్తే.. అసిస్టెంట్, పా...