Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Rozgar Mela

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు
National

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు.తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధ...