IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్ రూమ్ లాంటి గది, రూ.100తో బుక్ చేయొచ్చు
IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి, భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న చాలా వసతుల గురించి సరైన అవగాహన ఉండడం లేదు.
మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గానీ, కునుకు తీయడాని గానీ, లేదా స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి కాసేపు రెస్ట్ తీ కోసం ఒక గదిని కావాలనుకుంటే, హోటల్ రూమ్ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే హోటల్ రూంం వంటి గదిలో గడపొచ్చు.
కేవలం రూ.100కే రూమ్ బుకింగ్
రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను IRC...