
Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి
Republic Day 2025 : భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకోనుండగా, న్యూఢిల్లీలో ని కర్తవ్య మార్గ్ లోజరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల్లో దేశీయంగా తయారైన ప్రళయ్ క్షిపణి (Pralay missile) ని తొలిసారిగా ప్రదర్శించనుంది.ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన చిన్న క్షిపణి.. శత్రు భూభాగంలోకి వెళ్లి లోతుగా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ క్షిపణి భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతను మరో స్థాయికి పెంచింది. బ్రహ్మోస్ క్షిపణులు, టి-90 ట్యాంకులు ఇతర కీలకమైన ఆయుధాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇక్కడ విలేకరులతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున తొలిసారిగా ప్రళయ్ క్షిపణిని ప్రదర్శించనున్నామని తెలిపారు.Pralay missile ప్రత్యేకతలు ఇవే..డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ప్రళయ్ 500-1000-...