Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్
Telangana Rains Red Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం నమోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శనివారం అత్యంత భారీ వర్షాలు కురిశాయి.ఇక ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అతిభారీ వర్షాలు...