Cricket | బంగ్లాదేశ్ టెస్ట్ లో ఇరగదీసిన అశ్విన్.. మెరపు సెంచరీతో ఎంఎస్ ధోని టెస్టు రికార్డు సమం
Cricket | చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మెరుపు ఇన్నింగ్ తో సత్తా చాటాడు. కష్టకాలంలో కీలకమైన సెంచరీని సాధించడం ద్వారా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆల్-రౌండర్ తన ఆరో టెస్ట్ సెంచరీని అందించి దిగ్గజ క్రికెటర్లు MS ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల టెస్ట్ రికార్డును సమం చేశాడు. .38 ఏళ్ల అశ్విన్ MA చిదంబరం స్టేడియంలో మొదటి రోజు ప్రారంభంలో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత భారత్‌ను రక్షించడానికి వచ్చిన అశ్విన్, రవీంద్ర జడేజా ఏడో వికెట్‌కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని చక్కదిద్దారు.చెన్నైలో తన రెండో టెస్టు సెంచరీ నమోదు చేయడంతో 100 పరుగుల మార్కును అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే చేరుకున్నాడు. ధోనీ, పటౌడీల టెస్ట్ సెంచరీలను సమం చేసి మరోసారి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ధోనీ త...