Ration Card e- KYC : రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేశారా..? ఇంకా కొద్ది రోజులే త్వరపడండి..
Ration Card e- KYC in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. జనవరి 31వ తేదీతో సమయం ముగియనుండడంతో ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకుంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోసారి గడువు పెంచే చాన్స్ కూడా లేదని సమాచారం. .
రేషన్ షాపుల్లో గత రెండు నెలలుగా ఈ-కేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ నంబర్ ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రేషన్ లబ్ధిదారులు జనవరి 31 లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ స్కీమ్ ద్వారా దేశవ్యా...