ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం
అర్ధరాత్రి బాలిక సహా
ఇంటి ఓనర్ దారుణ హత్య..హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇ...