Ram Navami in Ayodhya | అయోధ్యలో రామనవమి.. VIP దర్శనాలకు బ్రేక్
Ram Navami 2025 : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్య (Ayodhya) లో భద్రతను ట్రాఫిక్ వ్యవస్థను కట్టుదిట్టం చేసింది యోగీ ప్రభుత్వం. ఆదివారం రామనవమి సందర్భంగా అయోధ్యను వివిధ జోన్లు, సెక్టార్లుగా విభజించినట్లు అయోధ్య రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, భారీ వాహనాలను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా పంపుతామని ఆయన చెప్పారు. మహా కుంభమేళా లాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన అన్నారు. భద్రత కోసం PAC (టెరిటోరియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలను మోహరించనున్నారు. సరయు నది చుట్టుపక్కల పోలీసులు, NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం), SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) లను అప్రమత్తం చేశారు.VIP దర్శనం ఉండదు..ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామమందిరం దర్శనం కోసం అన్ని ప్ర...