
Rakhi | రక్షా బంధన్ ను మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోండి..
Rakhi 2025 | రక్షా బంధన్‌ను సోదరుడు మరియు సోదరి మధ్య ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ (Raksha Bandhan) జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న, శనివారం జరుపుకోనున్నారు. ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతి రోజు కావడం విశేషంగా చెప్పుకోచవ్చు..రాఖీ (Rakhi ) కట్టేందుకు శుభ ముహూర్తం ఎప్పుడు?జ్యోతిష్య నిపుణుల ప్రకారం, ఆగస్టు 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టేందుకు అత్యంత శుభకరమైన సమయంగా చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితే విష్ణుమూర్తి అనుగ్రహం లభించడంతో పాటు, సోదరులు, సోదరీమణులు శాంతి, సౌభాగ్యంతో తమ బంధాన్ని మరింత బలపర్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.రక్షా బంధన్ సమయంలో జపించాల్సిన మంత్రాలు"యేన బద్ధో బలి రాజా, దానవేంద్రో మహాబలఃతేన త్వామ్ ప్రతిబధ్నామి రక్ష మా చల మా చ...