Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..
Begumpet | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme ) కింద తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్‌లో ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.‘‘తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఊహించిన మార్పు రూపుదిద్దుకుంటోంది. ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్ ముందు ద్వారం ఆకర్షణీయంగా కనిపించనుంది , అలాగే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ”అని మంత్రిత్వ శాఖ X లో సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఇది కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.స్టేషన్ కోడ్ BMT కలిగిన బేగంపేట రైల్వే స్టేషన్ లో రెండు ప్లాట్‌ఫారమ్‌లు, రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది . ఇది పూర్తిగా విద్యుద్దీకరించబ...