
Indian Railways | విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు ఈ స్టేషన్ లో హాల్టింగ్
Vande Bharat Express | ఏలూరు ప్రజలకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్ (Eluru Station)లో వందే భారత్ రైలును నిలపాలని డిమాండ్ వస్తోదంఇ. ఈ క్రమంలోనే ఎంపీ పుట్టా మహేశ్ స్పందించి ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో నిలిపేందుకు చర్యలు తీసుకున్నారు. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరు రైల్వేస్టేషన్ లో ఒక నిమిషం పాటు ఆగనుంది.విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఏలూరుకి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే వందేభారత్ రైలు... విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో నిలుస్తాయి. ఏలూరులో హాల్టింగ్ సౌకర్యం కల్పించినందు...