Pushpa 2 star Allu Arjun arrested : అర్జున్‌పై నమోదైన అభియోగాలు ఏమిటి?
Allu Arjun arrested : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (Pushpa 2) ఒకవైపు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. మరోవైపు పుష్ప 2 స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పై ఇటు అరెస్టు కావడం తెలుగు రాష్ట్రాలతోపాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ఓ మహిళ మృతిచెందగా ఓ బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ కేసులో తెలుగు నటుడు అరెస్టయ్యాడు.ఏం జరిగింది, ఆరోపణలు ఏమిటి?శుక్రవారం అల్లు అర్జున్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన నివాసం నుంచి చిక్కడ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 105, 118(1) కింద అల్లు అర్జున్, అతని భద...