Postal Jobs 2024 : పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..
Postal Jobs 2024 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబర్ 31. ఈమేరకు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణల్లో పోస్టుల వివరాలు..
Postal Jobs 2024 దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుండగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 15 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్) ఉద్యోగం చేస్తున్నవారు, అలాగే ఏదైనా గ్రాడ్యూషన్ (రెగ్యూలర్ లేదా డిస్టెన్స్) పూర్తిచేసి, అర్హత కలిగిన రెండేళ్ల అన...