Saturday, August 30Thank you for visiting

Tag: portals of Badrinath

Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..

Badrinath : బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయ్.. 15 టన్నుల పూలతో అద్భుతమైన అలంకరణ చూడండి..

National
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయ (Badrinath Temple) ద్వారాలు ఆరు నెలల తర్వాత ఆదివారం భక్తుల దర్శనం కోసం తెరిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, వైష్ణవాలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరవబడ్డాయి. వివిధ రకాలైన 15 టన్నుల రంగురంగు పూలతో ఆలయాన్ని అలంకరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Chief Minister Pushkar Singh Dhami), భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్, తెహ్రీ ఎమ్మెల్యే కిషోర్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు. బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజారి, రావల్, ధర్మాధికారి, వేదపతులు మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంతో పాటు, బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న గణేష్, ఘంటాకర్ణ, ఆది కేదారేశ్వర్, ఆది గురు శంకరాచార్య ఆలయం, మాతా మూర్తి ఆలయ ద్వారాలు కూడా భక్తుల కోసం తెరిచారు.చార్ ధామ్ ప్రయాణాన్ని (Char Dham Yatra) సురక్షితంగా చేయడానికి స్థానిక అధికారులు...