
Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ
Pune Porsche Accident news | పూణే: పోర్షే కారును అతివేగంగా నడిపి ఇద్దరు యువ టెక్కీల మరణానికి కారణమైన పూణే యువకుడి తండ్రికి రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులను మైనర్ బాలుడి తండ్రిని అరెస్టు చేశారు.
కళ్యాణి నగర్ లో ఆదివారం అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో 12వ తరగతి ఫలితాలను సంబరాలు చేసుకునేందుకు పూణెలోని రెండు పబ్బుల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన 17 ఏళ్ల బాలుడు తన కారును అతివేగంగా నడపడంతో 24 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే.. కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్ నడుపుతున్న టెకీలు అనీష్ అవధియా ఎగిరిపోయి ఆగి ఉన్న కారును ఢీకొట్టగా, వెనుక కూర్చున్న అశ్విని కోష్ట 20 అడుగుల ఎత్తులో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై దేశ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్...