
Indus water treaty | ఇకపై మన నదీ జలాలు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి..
PM Modi on water issue : పహల్గామ్ దాడి (Pahalgam Terror Attack) తర్వాత పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని మోదీ (PM Modi ) ఈరోజు నీటి సమస్య (Indus water treaty) పై కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో భారతదేశంలోని నీరు బయటకు వెళ్లేది. కానీ ఇప్పుడు దానిని భారతదేశ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు భారతదేశానికి హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుంచి బయటకు వెళ్లిపోయేదని ఆయన అన్నారు. ఇప్పుడు భారతదేశ జలాలు దేశ ప్రయోజనాల కోసమే ప్రవహిస్తాయి. దేశానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దేశంలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు. మునుపటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ముందు ప్రపంచం ఏమి చెబుతుందో ఆలోచి...