Pensioners Protest | పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలి
స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌వరంగల్ : మార్చి 2024 నుండి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం అసోసియేషన్ వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు తుమ్మ వీరయ్య అధ్యక్షతన జిల్లా బాధ్యులు సమావేశం వరంగల్‌లో జరిగింది. ఈ సమావేశంలో 2026 సంవత్సర యొక్క డైరీ కి సంబంధించిన విషయాలపై చర్చించారు.ఈ సందర్భంగా తుమ్మ వీరయ్య మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ల ముందు ఈనెల 27న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మార్చి 2024 నుంచి రిటైరైన పెన్షనర్లకు 18 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించక పోవడంతో ఆర్థిక కష్టాలతో కుంగిపోయి సు...

