
Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్
Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే అన్ని విధాలుగా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్ల ను నడిపిస్తోంది. రైల్వేస్టేషన్లను ఆధునికీకరించడంతోపాటు అత్యాధునిక సౌకర్యాలతో వందేభారత్ రైళ్లను కూడా అన్ని మార్గాల్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను తక్కువ దూరం గల మార్గాల్లో నడిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వచ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో కూడా నడిపించాలని భావిస్తున్నారు.అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్‌లో కాకుండా చైర్ కార్‌లో ఉన్నప్పటికీ, దీపావళి, ఛత్‌ల పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దిల్లీ – పాట్నాల మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును నడిపించాలని నిర్ణయించారు. పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అన...