Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి
Hyderabad : రహదారి మౌలిక సదుపాయాలను (Highway Roads ) మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ను అమలు చేయాలను భావిస్తోంది. ఈ నమూనా కింద రాష్ట్ర రహదారులు, రోడ్లు - భవనాలు (R&B) శాఖ నిర్వహించే రోడ్లు, పంచాయతీ రాజ్ (PR) శాఖ పర్యవేక్షించే గ్రామీణ రహదారులను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిదశలో రూ.28,000 కోట్ల అంచనా వ్యయంతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు.HAM నమూనా అంటే ఏమిటి?బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (BOT), ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ఫ్రేమ్‌వర్క్‌ల సమ్మేళనం అయిన HAM మోడల్, 2016లో భారతదేశంలో జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం ప్రవేశపెట్టారు. HAM కింద ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం నిధులు సమకూరుస్తుంది. అయితే ఇందులో ఈక్విటీ, రుణాల ద్వారా ప్రైవేట్ డెవలపర్లు మిగిలిన 60 శాతాన్ని ...