పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లడంపై బిజెపి విమర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు.పార్లమెంట్ సమావేశంలో ప్రియాంకగాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం రచ్చ రాజుకుంది. దాని మీద "పాలస్తీనా" అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజకీయాలు అనే ఆరోపణపై ప్రియాంక...