Champions Trophy 2025 | ‘ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించొద్దు’ .. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన
Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోజుకో వివాదం వెలుగుచూస్తోంది. ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు నిరాకరించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డైలమాలో పడింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ కోరినప్పటికీ అందుకు పాక్ అంగీకరించడం లేదు. పైగా కొన్ని పిసిబి చాలా షరతులు పెట్టింది. దీనికి సంబంధించి పలు సమావేశాలు జరిగాయి. కానీ ఇంకా ఎలాంటి ఫలితాలు వెలువడలేదు.రషీద్ లతీఫ్ వివాదాస్పద ప్రకటనఛాంపియన్స్ ట్రోఫీ వివాదం కొనసాగుతుండగా, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కొందరు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఉండకూడదని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ప్రకటించారు. ఐసీసీ ఈవెంట్...