Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..
Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 ద్వారా విజయవంతంగా పూర్తి చేసింది. ఇది ఒక క్షిపణి వ్యవస్థ. మనపై దాడి మొదలు కాగానే ఆటోమెటిక్ గా యాక్టివ్ అవుతుంది.శత్రు విమానాలను లేదా క్షిపణిని తక్షణమే గాలిలోనే నాశనం చేస్తుంది. భారత సైన్యం ఈ రక్షణ వ్యవస్థకు సుదర్శన చక్రం అని పేరు పెట్టింది, కాబట్టి ఈ సుదర్శన చక్ర (Sudarshan Chakra S-400) శత్రువును ఎలా నాశనం చేస్తుందో తెలుసుకుందాం.S-400 క్షిపణి అ...