‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు సర్వం సిద్ధం
One Nation, One Election bill | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సర్వన్నద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం ద్వారా ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని, స్థిరమైన పాలనకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్రస్తావించారు.నివేదికల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్రకారం.. ప్రస్తుతం జమిలి ఎన్నికలు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...