ముస్లిం వీధి ఆహార వ్యాపారులు వారి గుర్తింపును దాచిపెట్టి.. ‘జై శ్రీ రామ్’ టీ-షర్టులు ధరించి..
Uttar Pradesh Kanpur incident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కొందరు ముస్లిం వ్యాపారులు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టిన విషయాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు బట్టబయలు చేశారు. ఇద్దరు వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టేందుకు వారు ఏకంగా 'జై శ్రీ రామ్' అని రాసి ఉన్న టీ-షర్టును ధరించారు.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు స్నాక్స్ కొనడానికి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి విక్రేతలు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కాషాయ రంగు టీషర్టులు ధరించి ఉన్నారు. వారు హిందువులుగా భావించి తినుబండారాలను కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వెజ్ కబాబ్‌లను తింటుండగా వారికి ఏదో రుచిలో తేడా అనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు విచారించగా, వ్య...