HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!
HYD Metro | హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన పనులను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వర్క్ గా హైదరాబాద్ మెట్రో అవతరిస్తుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సక్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉందని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘనతను సంపాదించుకుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.ముం...