Saturday, August 30Thank you for visiting

Tag: new scheme

ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు

ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు

National
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది.  ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక ముఖ్యమైన భాగం. వారు అలుపెరగకుండా గంటల తరబడి వాహనాలను నడుపుతూనే ఉంటారు. కానీ వారికి సరైన విశ్రాంతి స్థలం అందుబాటులో లేదు. వారికి తగిన సమయం కూడా దొరకదు.  సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమీకారణంగా  కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది."ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ప్రధాని మ...